: మా పుష్కరాలకు రండి... కేసీఆర్ ను ఆహ్వానించనున్న బాబు సర్కారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును రాజమండ్రిలో జరిగే గోదావరి పుష్కరాలకు అతిథిగా రావాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించనుంది. కేసీఆర్ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పీఠాధిపతులు, మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు సహా మొత్తం 2,500 మందికి ఆహ్వానాలు పంపాలని నిర్ణయించినట్టు ఏపీ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. జూలై 1 నుంచి గోదావరికి అఖండ హారతిని ఇవ్వడం ప్రారంభించనున్నట్టు తెలిపారు. మొత్తం 20 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, పుష్కర ఘాట్లను వీవీఐపీ, వీఐపీ, సాధారణ ఘాట్లుగా విభజించామని ఆయన తెలియజేశారు.

More Telugu News