: తెలంగాణ, ఏపీ విద్యార్థుల ఉమ్మడి సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఉమ్మడిగా నిర్వహించిన స్టేట్ లెవెల్ ఎలిజిబులిటీ టెస్ట్ (సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 6,432 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. వారిలో తెలంగాణ నుంచి 3,540 మంది, ఏపీ నుంచి 2,892 మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి వెల్లడించారు. లెక్చరర్ పోస్టుల అర్హత కోసం ఏపీ, తెలంగాణ విద్యార్థులకు ఉమ్మడిగా రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్)ను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించారు.

More Telugu News