: ఆయనకు నా సలహా అవసరంలేదు... బంతిని స్టేడియం బయటకు కొడతారు : లలిత్ మోదీ

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు తన సలహా అవసరంలేదని అన్నారు. ఆయన ఎప్పుడైతే బ్యాటింగ్ కు దిగుతారో, అప్పుడు బంతిని స్టేడియం బయటకు కొడతారని ట్వీట్ చేశారు. లలిత్ మోదీకి ప్రయాణ పత్రాల విషయంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సాయపడ్డారని, వారు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతుండడం తెలిసిందే. ఓ రకంగా ఈ వివాదం బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసింది. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ ప్రధానిపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

More Telugu News