: శివాలయంలో సింహం కలకలం

అరణ్యాలు జనారణ్యాలుగా మారిపోతున్నాయి. దీంతో అడవి జంతువులు ఆహారం కోసం జంగిల్ ను వదిలి కాంక్రీట్ జంగిల్ లోకి చొరబడి, మనుషులపై ఎగబడుతున్నాయి. గుజరాత్ లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల తాకిడి తట్టుకోలేకపోయిన ఓ సింహం, అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామ శివాలయంలో దూరింది. శివుణ్ణి కొలిచేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా భక్తులపై దాడికి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం 15 గంటలు శ్రమించి సింహాన్ని బంధించి, అడవిలో విడిచిపెట్టారు.

More Telugu News