: నేను రాజీనామా చేయలేదు: మాటమార్చిన సెప్ బ్లాటర్

ఫీఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ మాట మార్చారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యలో అవినీతికి పాల్పడ్డారంటూ సెప్ బ్లాటర్ పై తీవ్ర విమర్శలు రావడం, ఫీఫా కార్యవర్గ సభ్యులను అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన సెప్ బ్లాటర్, ఐదోసారి ఫీఫా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే, రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన వారసుడ్ని వెతికేంతవరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. దీంతో ఆయన వారసుడు ఎవరు?, అంతర్జాతీయ ఫుట్ బాల్ వివాదం ఎప్పుడు సమసిపోతుంది? అంటూ క్రీడాప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ దశలో తాను రాజీనామా చేస్తానన్నాను కానీ, రాజీనామా చేయలేదంటూ బ్లాటర్ వివరణ ఇచ్చారు. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఆశ్చర్యపోయింది. బ్లాటర్ తాజా ప్రకటనతో వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదని, బ్లాటరే కామ పెట్టాడని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News