: ఏగాన్ టోర్నీలో సానియా-హింగిస్ దూకుడుకు కళ్లెం
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగపడుతుందనుకున్న ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీకి నిరాశ ఎదురైంది. టాప్ సీడ్లుగా బరిలో దిగిన ఈ వరల్డ్ నెంబర్ వన్ జోడీ శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో 5-7, 4-6తో కరోలిన్ గార్సియా, కేథరీనా స్రెబోట్నిక్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో సానియా-హింగిస్ జోడీ ఎన్నో అవకాశాలు వచ్చినా సద్వినియోగపర్చుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గంటా 21 నిమిషాల్లో ముగిసింది. ఇంగ్లాండ్ లోని ఈస్ట్ బర్న్ లో ఈ టోర్నీ జరుగుతోంది.