: రేవంత్ ను విచారించడానికి ఇంకేమీ లేదు... షరతులతో కూడిన బెయిల్ ఇవ్వండి: రేవంత్ తరపు న్యాయవాది లూథ్రా

రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను విచారించడానికి ఇంకేమీ లేదని ఆయన కోర్టుకు విన్నవించారు. ఏసీబీ ఇప్పటి వరకు 17 మందిని విచారించిందని, అన్ని సోదాలు నిర్వహించిందని, రికార్డులను సీజ్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే రేవంత్ 25 రోజుల పాటు జైల్లో ఉన్నారని చెప్పారు. రేవంత్ కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని తెలిపారు. ఈ కేసులో రేవంత్ నుంచి తీసుకోవాల్సిన సమాచారం ఏమీ లేదని... కావున, రేవంత్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయాలని కోర్టుకు లూథ్రా విన్నవించారు. అనంతరం, ఏసీబీ తరపు న్యాయవ్యాది తన వాదనలను ప్రారంభించారు.

More Telugu News