: సెరిలాక్ డబ్బాలో పురుగులు

మ్యాగీ నూడుల్స్ లో హానికారక రసాయనాలున్నాయంటూ వాటిని నిషేధించడంతో సగం చచ్చిన బహుళజాతి సంస్థ నెస్లేకు టైమ్ బాగున్నట్టు లేదు. నెస్లే తయారు చేస్తున్న సెరిలాక్ డబ్బాలో ఏకంగా పురుగులే కనిపించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటన, మెదక్ జిల్లా సంగారెడ్డిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మెడ్ ప్లస్ స్టోర్ లో పిల్లాడి కోసం సెరిలాక్ కొన్నానని... ఇంటికి వెళ్లి డబ్బాను తెరిచి చూస్తే పురుగులు ప్రత్యక్షం అయ్యాయని రాజేష్ అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించాడు. అంతేకాకుండా, నాసిరకం పదార్థాలను అమ్ముతున్న సెరిలాక్ పై ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే నెస్లే కంపెనీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు.

More Telugu News