: మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన గవర్నర్

ఈ ఉదయం నుంచి మూడు సార్లు హోం శాఖ అధికారులతో సమావేశమై కీలక చర్చలు జరిపిన గవర్నర్, వాటి గురించిన వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో రెండు దఫాలుగా చర్చలు ముగించిన అనంతరం బయటకు వచ్చిన నరసింహన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఓటుకు నోటు కేసుతో పాటు సెక్షన్ 8 అమలు, ఉమ్మడి రాజధానిలో నెలకొన్న సమస్యలు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి తదితర అంశాలపై హోం శాఖ అధికారులకు గవర్నర్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. నరసింహన్ తో మాట్లాడి వివరాలు సేకరించేందుకు పెద్దఎత్తున మీడియా ఎదురుచూసినప్పటికీ, ఆయన మీడియా వైపు కూడా చూడకుండా సీరియస్ గా వెళ్లిపోయారు. దీంతో రాజ్ నాథ్ సింగ్ గవర్నర్ కు ఏం చెప్పారన్న విషయమై సస్పెన్స్ నెలకొంది.

More Telugu News