: బల్గేరియా పర్యాటక మంత్రిని కలిసిన షారుఖ్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బల్గేరియా పర్యాటక శాఖ మంత్రి నికోలినా ఏంజెల్కోవాను కలిశారు. 'దిల్ వాలే' చిత్రం కోసం ప్రస్తుతం బల్గేరియాలోనే ఉన్న షారుఖ్ దర్శకుడు రోహిత్ శెట్టితో కలిసి మంత్రితో మాట్లాడారు. ఆమెతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల కాలంలో భారతీయ సినిమా వర్గాలు పెద్ద ఎత్తున బల్గేరియా బాట పడుతుండడంతో, అక్కడి పర్యాటక రంగంలో ఊపు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఎక్కువ చిత్ర బృందాలు బల్గేరియాలో షూటింగ్ నిర్వహిస్తున్నాయి. బాలీవుడ్ చిత్రాల్లో బల్గేరియా ప్రకృతి అందాలు చూసిన ప్రజలు ఇప్పుడక్కడికి భారీ సంఖ్యలో తరలివెళుతున్నారట. కాగా, బల్గేరియా టూరిజం డెవలప్ మెంట్ కోసం ప్రచారం చేయాలంటూ మంత్రి ఏంజెల్కోవా హీరో షారుఖ్ ను కోరినట్టు తెలిసింది. అంతకుముందు హీరో అజయ్ దేవగణ్ ను కూడా ఇలాగే కోరారట.

More Telugu News