: పదేళ్లు కాదు, వందేళ్లయినా హైదరాబాదులోనే ఉంటాం: రాజేంద్రప్రసాద్
హైదరాబాదు అందరిదని, ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లే కాదు, వందేళ్లయినా ఇక్కడే ఉంటామని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. హైదరాబాదు నుంచి సీమాంధ్రులను వెళ్లమనే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. అవసరమైతే హైదరాబాదును యూటీ చేయాలని పట్టుబడతామని అన్నారు. తెలంగాణ మొత్తాన్ని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కబ్జా చేయాలనుకుంటున్నారని... ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఏదో విధంగా టీఆర్ఎస్ లోకి లాక్కోవాలనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇతర పార్టీలకు ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ట చతుష్టయమయిన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులే తెలంగాణను ఏలాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.