: హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులంతా మా వాళ్లే: టీఆర్ఎస్

'ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉండే సీమాంధ్రులంతా మా వాళ్లే' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బిగాల గణేష్ లు అన్నారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని, అనవసర రాద్ధాంతం చేయరాదని అన్నారు. ఓటుకు నోటు వివాదం నుంచి తప్పించుకునేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనవసరంగా సెక్షన్-8ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీబీఐ కేసుల నుంచి సైతం తప్పించుకున్న ఘనమైన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.

More Telugu News