: రూ.9,999కే లెనోవా కె3 నోట్ ఫాబ్లెట్... ఇండియా మార్కెట్ లో లాంచ్
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లెనోవా భారత మార్కెట్ లో కె3 నోట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో చైనాలో మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్... ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో జులై 8 నుంచి కేవలం రూ.9,999లకే అమ్మకానికి పెడుతున్నారు. అయితే ఈ రోజు 2 గంటల నుంచే ఈ ఫోన్ అమ్మకాల రిజిస్ట్రేషన్ లు మొదలవుతాయి. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ (1920 x 1080 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ ప్లే ఉన్న లెనోవా కె3 నోట్... 2జీబీ రామ్ వస్తుంది. డ్యుయోల్ సిమ్ సౌకర్యంతో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది.