: మత్తయ్య పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడు అయిన జరూసలెం మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ పిటిషన్ కు సంబంధించి ఇరు వైపుల వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను 29వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, కేసు నుంచి తనను తొలగించి న్యాయం చేయాలంటూ హైకోర్టులో మత్తయ్య పిటిషన్ వేశారు. మరోవైపు, ఇప్పటి వరకు టీఎస్ ఏసీబీకి దొరకకుండా మత్తయ్య తప్పించుకు తిరుగుతున్నారు.