: రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ శుక్రవారానికి వాయిదా


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు బెయిల్ పిటీషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పిటీషన్ లో ప్రభుత్వ వాదనను వినిపించడానికి సమయం కావాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కోర్టును కోరారు. దీంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

  • Loading...

More Telugu News