: ఒక్క బటన్ కూడా లేకుండా యాపిల్ సరికొత్త స్మార్ట్ ఫోన్!
ఒక్క బటన్ కూడా లేకుండా స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో యాపిల్ నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. అంటే, ఫోన్ స్విచ్ ఆన్ / ఆఫ్ బటన్, వాల్యూమ్ బటన్స్, ఇంకా స్పెషల్ పిక్చర్ క్లిక్ బటన్ వంటివి కూడా లేకుండా ఉండే ఫోన్ ను యాపిల్ అభివృద్ధి చేస్తోందన్న మాట. తైవాన్ లోని యాపిల్ రీసెర్చ్ కేంద్రంలో ఈ ఫోన్ తయారీ పనులు జరుగుతున్నాయని సమాచారం. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదనపు ఆకర్షణని తెలుస్తోంది. ఐఫోన్లో కనిపించే హోం బటన్ కూడా ఇందులో ఉండదు. వర్య్చువల్ హోం బటన్ కోసం ఫోర్స్ టచ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే టచ్ లో కూడా గట్టిగా నొక్కితే అదే హోం బటన్ గా అవుతుంది. ఇప్పటికే ఈ ఫోర్స్ టచ్ ఆప్షన్ ను మాక్ బుక్, యాపిల్ వాచ్ తదితరాల్లో పరిచయం చేసిన యాపిల్, తాజాగా ఐ ఫోన్లలోనూ అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.