: గూగుల్ శోధనలో అశ్లీల ఫోటోలకు ఇకపై సెన్సార్!


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో అశ్లీల ఫోటోలకు, దృశ్యాలకు ఇకనుంచి సెన్సార్ బ్రేక్ పడబోతోంది. ఇకపై ఎవరైనా అశ్లీల దృశ్యాలు, ఫోటోలు చూడాలనుకున్నా, పోస్ట్ చేయాలనుకున్నా తప్పకుండా గూగుల్ సెన్సార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం సెన్సార్ షిప్ ఫామ్ ఒకటి గూగుల్ సెర్జ్ ఇంజన్ లో దర్శనమిస్తుంది. ఇందుకోసం గూగుల్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిందని, మరికొన్ని వారాల్లోనే సెన్సార్ విధానం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విధానమే గనుక వస్తే ఇప్పటికే అనధికారికంగా ఉన్న అశ్లీల దృశ్యాలు కనుమరుగు కావచ్చని అంటున్నారు. అంతేకాదు, కుప్పలు తెప్పలుగా అటువంటివి పోస్ట్ చేసే వారికి కూడా అడ్డుకట్ట వేసినట్టవుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News