: కొరుకుడు పడని బంగ్లా ఓపెనర్లు... భారత సహనానికి పరీక్ష!

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లా ఓపెనర్లు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు, తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్ లను ఓపెనర్లుగా పంపింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ, అప్పుడప్పుడూ విరుచుకు పడుతూ టీ-20 ఆటను తలపించారు. దీంతో 14వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. ఈ క్రమంలో సౌమ్యా సర్కార్ 38 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 53 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న ఇక్బాల్ 42 బంతుల్లో 45 పరుగులు చేసి ఆడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 13.3 ఓవర్లలో 102/0.

More Telugu News