: బెజవాడలో చంద్రబాబు రాత్రి బస... బస్సులోనే నిద్రించనున్న ఏపీ సీఎం

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి రాత్రి విజయవాడలోనే బస చేయనున్నారు. అయితే విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభమైనా, బస చేసేందుకు ప్రభుత్వ వసతి లేదు. దీంతో తన పర్యటనల కోసం వినియోగిస్తున్న బస్సులోనే చంద్రబాబు రాత్రి నిద్రించనున్నారు. ఇకపై వారంలో మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, అందుకవసరమైన తాత్కాలిక నివాసాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కృష్ణా కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ఎంపిక చేశారు. అయితే ఆ ఇంటి నిర్మాణంపై వెల్లువెత్తిన వివాదం నేపథ్యంలో అధికారులు కాస్త వెనక్కు తగ్గినట్లు సమాచారం. తాత్కాలిక నివాసం ఏర్పాటయ్యేదాకా విజయవాడ పర్యటనలో చంద్రబాబు వసతికి ఇబ్బందులు తప్పేలా లేవు.

More Telugu News