: వన్డేల్లో అది మంచి జట్టే... బంగ్లా క్రికెటర్లకు కెప్టెన్ కూల్ ప్రశంస!
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా నిన్న టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యర్థి జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో బంగ్లా జట్టు మెరుగైన జట్టేనని అతడు వ్యాఖ్యానించాడు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని పేర్కొన్నాడు. క్రమేణా ఆ జట్టు ఆటగాళ్ల ప్రతిభ ఇనుమడిస్తోందని కితాబిచ్చాడు.
బంగ్లా జట్టులో ప్రధాన ఆటగాళ్లు 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్ కప్ వరకు జట్టులో ఉండే అవకాశాలున్నందున, ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరచడం ఖాయమని ధోనీ జోస్యం చెప్పాడు. ఇక టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తన దృక్పథంలో ఎలాంటి మార్పు రాలేదని, జట్టు విజయమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు అతడు వెల్లడించాడు.