: యూపీఎస్సీలో ట్రాన్స్ జెండర్స్ కోసం నిబంధనలు రూపొందించలేము: కేంద్రం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా దరఖాస్తు పత్రాల్లో ట్రాన్స్ జెండర్ల (లింగ మార్పిడి చేయించుకున్నవారు) కోసం నిబంధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వారికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించలేమని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు పత్రంలో ట్రాన్స్ జెండర్లను మూడో జెండర్ ఆప్షన్ గా ఎందుకు పెట్టకూడదో వివరించాలంటూ రెండు రోజుల కిందట ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అడిగింది. ఈ క్రమంలోనే కేంద్రం పైవిధంగా సమాధానమిచ్చింది.