: జగన్ కు ఒక రూల్, చంద్రబాబుకు మరో రూల్ ఉంటుందా?: మంత్రి మహేందర్ రెడ్డి
ఏపీ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఏపీ పోలీస్ స్టేషన్లు పెడతామని అంటున్నారని... అలా చేస్తే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు గాజులు తొడుక్కొని లేరని అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైదరాబాదులో ఏం పని?' అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. గతంలో వైకాపా అధినేత జగన్ జైలుకు వెళ్లేంత వరకు చంద్రబాబు వెంటపడ్డారని... ఇప్పుడు తన వరకు వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 'జగన్ కు ఒక రూల్, చంద్రబాబుకు మరో రూల్ ఉంటుందా?' అని ప్రశ్నించారు.