: నేతల కాళ్లు పట్టుకుంటున్నా చంద్రబాబుకు మద్దతు దొరకడంలేదు: కర్నె ప్రభాకర్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకుంటున్నా మద్దతు దొరకడంలేదని తెలిపారు. ప్రధాని మోదీ కూడా సహకరించకపోవడంతో ఇప్పుడు సెక్షన్-8 గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇక, ఏపీ టీడీపీ నేతలపైనా కర్నె మండిపడ్డారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, మరికొందరు నేతలు గవర్నర్ నరసింహన్ ను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామన్న గవర్నర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News