: గవర్నర్ తో తెలంగాణ డీజీపీ భేటీ... ఓటుకు నోటుపై పెరుగుతున్న ఉత్కంఠ
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది. నేటి ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ ముగిసిన మరుక్షణమే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లిన అనురాగ్ శర్మ గవర్నర్ తో కీలక అంశంపైనే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీపై వార్తలు వెలువడిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆసక్తికర చర్చకు తెరలేచింది.