: కాకినాడలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు!
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలకలం రేగింది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన కాండ్రేగుల నర్సింహులు పత్రాలను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. దాంతో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన నామినేషన్ పత్రాలను ప్రత్యర్థులే లాక్కెళ్లారని నర్సింహులు ఆరోపిస్తున్నాడు.