: ఛత్తీస్ గఢ్ లో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

ఛత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర- చంపా జిల్లా నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. పది కిలో మీటర్లు సాగే ఈ పాదయాత్రలో గిరిజనులు, రైతులను కలసి భూసేకరణ చట్టం గురించి రాహుల్ మాట్లాడతారు. సారధి గ్రామం నుంచి ప్రారంభించిన రాహుల్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 10 నుంచి 12 గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ యాత్రలో పంట నష్టపోయిన రైతులనే గాకుండా, పోలవరం, కన్హర్ డామ్ ప్రాజెక్టుల ద్వారా నష్టపోయిన గ్రామస్థులతో కూడా రాహుల్ మాట్లాడతారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శైలేష్ నితిన్ త్రివేదీ తెలిపారు. తరువాత దాబ్రా గ్రామం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో రాహుల్ మధ్యాహ్నం ప్రసంగించనున్నారు.

More Telugu News