: ఎవరెవరు, ఏం చేశారో అన్నీ బయటపెడతా: లలిత్ మోడీ

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వీసా సంబంధ వివాదంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. ప్రయాణ పత్రాల విషయంలో ఆమె లలిత్ మోడీకి సహకారం అందించారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లలిత్ మోడీ స్పందించారు. భారత్ లో తనపై జరుగుతున్న కుట్రలపై స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీసీఐలోనూ, ఐపీఎల్ లోనూ 2010 నుంచి ఎవరెవరు, ఏం చేశారో అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఆ విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయని అన్నారు. ఇక, తనపై మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

More Telugu News