: ఆ ప్రకటనలను తొలగించండి... 'ఎకనామిక్ టైమ్స్'కు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశం
ఎకనామిక్ టైమ్స్ నౌ (ఈటీ నౌ) ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, వీటిని ఈ నెల 22లోగా తొలగించాలని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ) ఆదేశించింది. అంతకుముందు బిజినెస్ మీడియాలో ఈటీకి పోటీగా ఉన్న సీఎన్ బీసీ-టీవీ 18 ఫిర్యాదు చేసింది. ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ చానల్ గా ఈటీ ప్రచారం చేసుకుంటోందని ఫిర్యాదు రాగా, దీనిపై ఏఎస్ సీఐ విచారణ జరిపింది. ఇండియాలోని ఇంగ్లీషు బిజినెస్ చానళ్లలో ఈటీ నౌ నెంబర్ వన్ అని, రీజనల్ చానళ్లకు సంబంధం లేదని గమనించింది. ఏఎస్ సీఐ కోడ్ ఐ-4 ప్రకారం ఈటీ నౌ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని తెలిపింది. ఈ ర్యాంకు ఇచ్చిన బీఏఆర్సీ కేవలం రెండు వారాల వ్యూవర్ షిప్ డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, నిబంధనల ప్రకారం ఇది కూడా విరుద్ధమేనని తెలిపింది. తక్షణం తప్పులు సవరించుకోవాలని ఆదేశించింది.