: మలేషియా చమురు నౌక 'ఎంటీ ఆర్కిమ్ హార్మొనీ' అదృశ్యం

మలేషియాకు చెందిన చమురు రవాణా నౌక 'ఎంటీ ఆర్కిమ్ హార్మొనీ' ఆచూకీ లేకుండా పోయింది. మలక్కా నుంచి క్వాంటన్ వెళుతుండగా సముద్రజలాలపై అదృశ్యమైంది. నౌక దాదాపు 7.5 మిలియన్ లీటర్ల పెట్రోల్ ను రవాణా చేస్తోంది. ఈ చమురు నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 16 మంది మలేషియన్లు, ఐదుగురు ఇండోనేషియన్లు, ఒక మయన్మార్ జాతీయుడు ఉన్నారు. ఈ నౌక గురువారం నాడు అదృశ్యమైందని మలేషియా అధికార వర్గాలు తెలిపాయి. ఘటనపై దేశ ప్రధాని నజీబ్ రజాక్ ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. నౌక ఆచూకీ కోసం గాలింపు చర్యలు తీవ్రంగా సాగుతున్నాయి.

More Telugu News