: ప్రశ్నించే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
ఎలాంటి అన్యాయాన్నైనా, ఎవర్నైనా ప్రశ్నిస్తానన్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రశ్నించే పవన్ ఎక్కడున్నారూ...? అని అడిగారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై పవన్ ఇంతవరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బలంలేని చోట సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎందుకు ప్రకటించారన్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీలో కూడా ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెస్తున్నారా? అని సూటిగా నిలదీశారు. చంద్రబాబు రాజీనామా చేసేలా కేంద్రం, గవర్నర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.