: తోమర్ సహకరించడం లేదు: ఢిల్లీ పోలీసులు

తప్పుడు సర్టిఫికెట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విచారణకు సహకరించడం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇంటరాగేషన్ లో భాగంగా తామడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పలు ప్రశ్నలకు తామింకా సమాధానాలు తెలుసుకోవాల్సి వుందని అన్నారు. కాగా, తోమర్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ నిమిత్తం ఆయన్ను ఢిల్లీలోని కొన్ని కాలేజీలకు తీసుకువెళ్లాల్సి వుందని తెలిపారు. తోమర్ ను ఈ నెల 9న పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News