: బెజవాడలో ఇళ్లపై పడుతున్న కొండరాళ్లు... పరుగులు పెడుతున్న నగరవాసులు
తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో రాత్రి మొదలైన వర్షం నేటి ఉదయం దాకా కురుస్తూనే ఉంది. ఈ కారణంగా కొండలపై నుంచి బండరాళ్లు సమీపంలోని ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి. తమపైకి దూసుకువస్తున్న కొండరాళ్లను చూసి జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లు వదిలి పరుగులు పెడుతున్నారు. నగరంలోని సిద్ధార్థ కళాశాల, మొఘల్రాజపురం తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లపై కొండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, వారిలో నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.