: అన్నవరం ప్రసాదాల తయారీ కేంద్రంలో పేలుడు... ముగ్గురికి గాయాలు
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో నేటి ఉదయం పేలుడు సంభవించింది. ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్వామి వారి ప్రసాదం తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రసాదం తయారీలో నిమగ్నమైన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.