: కేంద్ర మంత్రులకు తిరుమల లడ్డూలిచ్చిన చంద్రబాబు... లాబీయింగ్ లో భాగమేనట!
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాను కలిసిన కేంద్ర మంత్రులకు తిరుమల వెంకన్న ప్రసాదం (లడ్డూ)ను అందజేశారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు పుష్పగుచ్ఛాలతో పాటు ఓ కవర్ లో పెట్టిన తిరుమల వెంకన్న ప్రసాదాన్ని ఆయన అందజేశారు. వెంకన్న ప్రసాదాన్ని చంద్రబాబు తాను కలిసిన ప్రముఖులకు అందించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.
అయితే మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు చంద్రబాబు అందజేసిన ప్రసాదంపై ఆయన వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులను మచ్చిక చేసుకునే క్రమంలో ఇదో ఉపాయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులకు చంద్రబాబు ప్రసాదాలు అందిస్తున్న దృశ్యాలను ఓ తెలుగు పత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో పాటు లాబీయింగ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలూ చేసింది.