: సాంకేతిక సమస్య...అమెరికా వీసాలు ఆలస్యం
ఈ ఏడాది అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లేవారు కొంచెం ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. సాంకేతిక లోపంతో భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లలోని అమెరికా కాన్సులేట్లలో సేవలు స్తంభించాయి. వీసా జారీలో జాప్యంతో మే 26 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పాస్ పోర్టులు ఆలస్యంగా అందనున్నాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది.