: తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలకు ఊరట
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్టీయూ అనుబంధంగా కొనసాగుతున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో సరైన మౌలిక వసతులు లేవంటూ తెలంగాణ ప్రభుత్వం పదుల సంఖ్యలో కళాశాలల అనుమతులు రద్దు చేసింది. దీంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో అవకాశాల కల్పనకు ఈ నెల 20 వరకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 20 తరువాత సౌకర్యాల కల్పన పర్యవేక్షించాలని, ఆ తరువాతే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని జేఎన్టీయూను న్యాయస్థానం ఆదేశించింది.