: హైకోర్టులో టీ.ప్రభుత్వానికి ఎదురుదెబ్బ... విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై స్టే
తెలంగాణ జెన్ కోలో స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు మార్గదర్శకాల ఆదేశాలను కోర్టు నిలిపివేసింది. ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగుల రిలీవ్ ప్రక్రియ నిలిపివేయాలని పేర్కొంది. తాజాగా 1,100 మంది ఉద్యోగులను ఏపీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో తమ స్థానికత ఇక్కడే ఉందంటూ ఏపీ ఉద్యోగులు తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్ధానం తాజాగా వారికి అనుకూలంగా స్టే విధించింది.