: చంద్రబాబు నక్సలైటా?...ఆయన ఫోనెందుకు ట్యాప్ చేశారు?: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ కు గురైందన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తొలుత దీనిపై అంతగా స్పందించని తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు ఫోన్ ను ట్యాపింగ్ చేయలేదని తేల్చిచెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వ పెద్దల వివరణను ఏ ఒక్కరూ నమ్మడం లేదు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కు గురైందని ఏపీ పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు ఏమైనా టెర్రరిస్టా? లేక నక్సలైటా? ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు?’’ అని ప్రశ్నించారు.