: చంద్రబాబుకు అండగా కేంద్రం... నేడు ఇరు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ భేటీ?

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తునకు మోదీ సర్కారు నిన్న ఆదేశాలు జారీ చేసిందన్న వాదన వినిపిస్తోంది. అంతేకాక నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రతి చోటా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య నెలకొన్న వివాదాన్ని తక్షణమే పరిష్కరించే బాధ్యతను కేంద్రం గవర్నర్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు నేడు రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ లను గవర్నర్ పిలిపించుకుని మాట్లాడే అవకాశాలున్నాయని సమాచారం. మరి గవర్నర్ ఆహ్వానానికి ఇరువురు సీఎంలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News