: కోట్లు దండుకోడానికే కేసీఆర్ ప్రాజెక్టులంటున్నారు: బీఎస్పీ
కోట్లు దండుకోవడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు కడతామంటున్నారని బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) ఆరోపించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడాన్ని బీఎస్పీ తప్పుపట్టింది. రైతులు, పేదలకు నీరు సకాలంలో అందాలంటే తక్షణం పాత ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఎత్తిపోతల పథకానికి 35 వేల కోట్లు కేటాయించడం దోచుకోవడానికేనని వారు ఆరోపించారు. పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి, వారి ద్వారా ఆ మొత్తాన్ని దోచుకుంటున్నారని బీఎస్పీ నేతలు విమర్శించారు.