: సీఎస్, డీజీపీ ఫిర్యాదు చేశారంటే పూర్తిస్థాయి సమాచారం ఉన్నట్టే: హోం మంత్రి చినరాజప్ప

ఏపీ హోం మంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ సీఎస్, డీజీపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. సీఎస్, డీజీపీ ఫిర్యాదు చేశారంటే పూర్తిస్థాయి సమాచారం ఉన్నట్టేనని అన్నారు. టేపులు ఉన్నాయని తెలంగాణ సర్కారు చెప్పిందని, ట్యాపింగ్ చేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు. ఏపీని ముందుకు తీసుకెళుతున్న చంద్రబాబుకు మంచిపేరు వస్తుండడం చూసి, ఆయనను ఎలాగైనా అడ్డుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారంలోకి లాగారని ఆరోపించారు. ఇక, హైదరాబాదులో ఏపీ వారిపై దాడులు జరిగే పరిస్థితి నెలకొందన్నారు. అందుకే, ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. హైదరాబాదు లా అండ్ ఆర్డర్ పై అధికారాలు గవర్నర్ చేతిలో ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

More Telugu News