: భారత్ లో బాలకార్మిక వ్యవస్థపై 'క్రై' నివేదిక

భారత్ లో బాలకార్మిక వ్యవస్థ ఎంతలా వేళ్లూనుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హోటళ్లలోనూ, కుటీర పరిశ్రమల్లోనూ ముక్కుపచ్చలారని చిన్నారులు చెమటోడ్చుతూ కనిపిస్తారు. భవననిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ వయసుకు మించిన భారాన్ని మోస్తుంటారు. దీనిపై చైల్డ్ రైట్స్ అండ్ యు (క్రై-సీఆర్ వై) ఓ నివేదిక రూపొందించింది. భారత్ లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శతాబ్దం కన్నా ఎక్కువ కాలమే పడుతుందని ఆ నివేదికలో తెలిపారు. దేశంలో కోటి మందికి పైగా బాలలు శ్రమజీవులుగా ఉన్నారని పేర్కొన్నారు. బాలకార్మికుల సంఖ్య చాలా నిదానంగా తగ్గుతూ వస్తోందని వివరించారు.

More Telugu News