: మేము మయన్మార్ అనుకుంటున్నారా?: భారత్ ను హెచ్చరించిన పాక్

భారత సైన్యం సరిహద్దులు దాటి, మయన్మార్ లోకి చొరబడి మరీ మిలిటెంట్లను హతమార్చి వచ్చిన ఘటనపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. తమ దగ్గర అలాంటి పప్పులుడకవని, పాకిస్థాన్, మయన్మార్ లాగా కాదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి నిస్సార్ అలీ ఖాన్ అన్నారు. ఇండియాను దెబ్బతీసే వారితో తమ వ్యవహార శైలి ఇలానే ఉంటుందని, కొందరు నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నిస్సార్ స్పందించారు. సరిహద్దులు దాటి వస్తే అందుకు తగ్గ జవాబు చెప్పడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. "కొందరు భారత నేతలు పగటి కలలను కంటున్నారు. వాటిని ఆపివేయండి" అన్నారు. పాకిస్థాన్ శాంతి చర్చలకు ఆహ్వానిస్తుంటే, భారత్ తిరస్కరించడం తనకు అసంతృప్తిని కలిగించిందని తెలిపారు.

More Telugu News