: చంద్రబాబు సతీమణిని ఆహ్వానించిన రేవంత్ అర్ధాంగి గీత
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం గురువారం జరగనున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్ కు తన ఇంట శుభకార్యంలో పాలుపంచుకునే అవకాశం దక్కింది. కాగా, నిశ్చితార్థం రేపు ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రంగాల ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ కుటుంబ సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. రేవంత్ అర్ధాంగి గీత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆహ్వానించారు. నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసి తమ కుమార్తెను దీవించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా, నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లను భువనేశ్వరి, లోకేశ్... రేవంత్ సతీమణిని అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గీతకు వారు ధైర్యం చెప్పారు.