: చీమలు పెట్టిన పుట్టలో పాములా దూరావ్!: చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. "చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు వచ్చి చేరినట్టు తెలుగుదేశం పార్టీలోకి వచ్చావు. మామకు వెన్నుపోటు పొడిచి పీఠం చేజిక్కించుకున్నావు. ఇప్పుడు ఏపీలో సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణలో కుట్రలు చేస్తున్నావు" అని మండిపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాజీనామా చేయాలని సుమన్ డిమాండ్ చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఎందుకు కోరడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా తప్పు చేసినట్టు అంగీకరించాలని అన్నారు.

More Telugu News