: సుజనాతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆయన వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు కూడా వచ్చారు. చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులు బయటికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఓటుకు నోటు వ్యవహారంలో గట్టి పట్టుదల ప్రదర్శిస్తుండడంతో చంద్రబాబుకు కష్టాలు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ వ్యవహారంలో బాబుకు నోటీసులు పంపే విషయమై ఏసీబీ సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్నాయి.

More Telugu News