: తప్పు చేసివుంటే రేవంత్ అనుభవిస్తాడు: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ఆయన తప్పు చేసి వుంటే శిక్ష అనుభవిస్తారు, లేకుంటే నిర్దోషిగా బయటకు వస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. నేటి ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని ఆయన అన్నారు. తమ నేతలు ఉమ్మడి రాజధానిలో ఏవో సొంత విషయాలు మాట్లాడుకుంటుంటే ఫోన్లను ట్యాప్ చేయడం ధర్మమా? అని ప్రశ్నించారు. తమ నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.