: నేడు కోర్టుకు సాక్ష్యాలు... ఢిల్లీ నుంచి రాగానే బాబుకు నోటీసులు?
'ఓటుకు నోటు' కేసులో పూర్తి సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను తెలంగాణ ఏసీబీ అధికారులు నేడు కోర్టుకు అందజేయనున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి బెయిలు ఇవ్వరాదని కూడా ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. కేసు విచారణ కీలక దశకు చేరుకున్నందున బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించనుంది. ఈ కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు జారీ చేసి, 48 గంటల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బాబు ఢిల్లీలో ఉన్నందున, ఆయన తిరిగి రాగానే నోటీసులు ఇవ్వొచ్చని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. నోటీసులు ఇచ్చే ముందు మరోసారి సీనియర్ అధికారులను సంప్రదించాలని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసులో సీఎం స్థాయి నుంచి కారు డ్రైవర్ వరకూ మరో 15 మంది పేర్లను ఏసీబీ తన నివేదికలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.