: మరో ‘ట్రావెల్స్’ ప్రమాదం... అనంతపురం జిల్లాలో 30 మందికి గాయాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. గత రాత్రి అనంతపురం జిల్లాలో ఎస్వీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాదు-బెంగళూరు జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా, వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలోని మరూరు టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రావెల్స్ యాజమాన్యం, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న స్థానిక పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

More Telugu News