: దగ్గు మందు ముసుగులో డ్రగ్స్... మందుల కంపెనీ యజమాని అరెస్టు
హైదరాబాదులో డ్రగ్స్ దందా బట్టబయలైంది. దగ్గు మందు ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఆరోపణలతో అబాట్ కంపెనీ యజమాని ఆరీబ్ ను హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ లో ఉన్న అబాట్ కంపెనీలో దగ్గుకు ఉపయోగించే పెన్సిడిల్ ను తయారు చేస్తున్నారు. బంగ్లాదేశ్ కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 57 కోట్ల రూపాయల విలువైన పెన్సిడిల్ మందులను స్వాధీనం చేసుకున్నట్టు డీజీ అకున్ సబర్వాల్ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని ఆరీబ్ ని విచారిస్తామని ఆయన వెల్లడించారు.